: ట్రంప్ నిర్ణయంపై విరుచుకుపడిన ఒబామా.. క్రూరమైన చర్య అని మండిపాటు!
ఎనిమిది లక్షల మంది ‘డ్రీమర్ల’ జీవితాలపై ప్రభావం చూపేలా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తప్పుబట్టారు. అదో అనాలోచిత నిర్ణయమన్నారు. డ్రీమర్ల ప్రోగ్రాంకు ముగింపు పలికేలా తీసుకున్న ఈ నిర్ణయం ఉత్తమ భవిష్యత్తు కలిగిన యువకుల జీవితాల్లో చీకట్లు కమ్మేలా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువకులను లక్ష్యంగా చేసుకోవడం దారుణమని, అదో క్రూరమైన, హింసాత్మక నిర్ణయమని అభివర్ణించారు.
ఒబామా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును రద్దు చేస్తున్నట్టు ప్రకటించి 8 లక్షల మంది యువకుల జీవితాలను ట్రంప్ చీకట్లలోకి నెట్టారు. ట్రంప్ నిర్ణయం ఏడువేల మంది భారతీయులపైనా పడింది. ఫలితంగా ఈ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనికి వ్యతిరేకంగా అప్పుడే ఆందోళనలు కూడా మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన ఒబామా.. ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.