: అవును.. అజారుద్దీన్ తో విడిపోయా.. అయినా సన్నిహితంగానే ఉన్నా: సంగీతా బిజిలానీ
భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ తో విడాకులు తీసుకున్నానని, ఆయనతో విడిపోయానని బాలీవుడ్ నటి సంగీతా బిజిలానీ స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్నప్పటికీ... ఆయనతో సన్నిహితంగానే ఉన్నానని చెప్పింది. ఇదే సమయంలో అజార్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'అజార్' సినిమాలో వాస్తవాలను తప్పుగా చూపించారని ఆమె మండిపడింది. ఈ సినిమాను చూసిన వారంతా మ్యాచ్ ఫిక్సింగ్ కేసును మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటారని చెప్పింది. తాను, అజార్ మొదటిసారి కలుసుకున్న సన్నివేశాన్ని కూడా తప్పుగా చూపించారని తెలిపింది. 1996లో అజార్ ను సంగీత పెళ్లాడింది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పిన సంగీత... ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభిస్తానని చెప్పింది. ఇప్పటికే పలువురు తనను సంప్రదిస్తున్నారని తెలిపింది.