: మయన్మార్ లో అంగ్ సాన్ సూకీతో మోదీ భేటీ.. రోహింగ్యా ముస్లింలపై చర్చ?
బ్రిక్స్ సదస్సు కోసం చైనా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుంచి రెండు రోజుల పర్యటన నిమిత్తం మయన్మార్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు మయన్మార్ ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. దేశాధ్యక్షుడు హెచ్ టిన్ క్యావ్ తో నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం ప్రధానికి మయన్మార్ సైనిక గౌరవ వందనం లభించింది.
నేడు మయన్మార్ కౌన్సిలర్, ఆ దేశ ముఖ్యనేత ఆంగ్ సాన్ సూకీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాలపై చర్చించనున్నారు. ప్రధానంగా మయన్మార్ లో రాఖినే రాష్ట్రంలో రోహింగ్యా ముస్లింలపై పెరుగుతున్న దాడులు, వారు ప్రమాదకరమైన దారుల గుండా ప్రయాణించి సరిహద్దులు దాటి ఇతర దేశాల్లో ఆశ్రయం పొందడంపై చర్చించనున్నారు.