: 'ప్రజలను చంపేస్తున్నారు, కళ్లు పీకుతున్నారు... పోలీసుగా ఇంత దారుణాలను చూడలేను' అంటూ రాజీనామా చేసిన కశ్మీర్ పోలీసు!


గత ఏడు సంవత్సరాల నుంచి కశ్మీర్ లో పోలీసుగా విధులు నిర్వహిస్తున్న రయీస్ అనే వ్యక్తి, తన ఉద్యోగానికి రాజీనామా చేస్తూ, అందుకుగల కారణాలను చెబుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అదిప్పుడు వైరల్ అవుతోంది. తన మనస్సాక్షి మరణిస్తూ ఉంటే చూస్తుండలేకనే రాజీనామా చేశానని రయీస్ ఈ వీడియోలో వెల్లడించాడు. కశ్మీర్ లో హింస పెరిగిందని, బాగుపడే పరిస్థితి కనిపించడం లేదని చెప్పాడు. తాను చేస్తున్నది రైటో, రాంగో తెలియదని, ఓ పోలీసు అధికారిగా ఇక్కడ రక్తపాతాన్ని చూడలేకున్నానని అన్నారు. ఎన్నో ప్రశ్నలకు సమాధానం తెలియకనే రాజీనామా చేయాలన్న నిర్ణయానికి వచ్చానని చెప్పాడు.

"నా జీహాద్ (పవిత్ర యుద్ధం) ఎంతో క్లిష్టంగా సాగుతోంది. నేను ఉద్యోగంలో చేరేటప్పుడు పౌరుల సమస్యలు పరిష్కరిస్తారని ప్రమాణం చేశాను. కానీ, కాశ్మీర్ లోయలో ఆపలేని పెను తుఫాను కొనసాగుతోంది. ఇక్కడ పరిస్థితి అత్యంత దారుణం. ప్రతిరోజూ కశ్మీరీలను కాల్చి చంపుతున్నారు. ఎంతో మంది కళ్లు పీకుతున్నారు. జైళ్లలో వేస్తున్నారు. గృహ నిర్బంధాలు సర్వసాధారణం. కశ్మీర్ ప్రజలు తమ స్వాతంత్య్రాన్ని కోరుకుంటూ ఉండటమే సమస్యగా మారింది. ప్రజలు ప్రజాభిప్రాయ సేకరణ కోరుతున్నారు. అది ఎన్నటికీ జరగదని తెలుసు. అందుకే ఈ రక్తపాతం ఆగదు. నేను పాక్ ను ఇష్టపడను. ఇండియాను ద్వేషించను. కశ్మీర్ ను ప్రేమిస్తున్నాను. ఇక్కడ శాంతి కావాలి. అది నా చేతుల్లో లేదని తెలుసు. అందుకే ఓ పోలీసుగా రక్తపాతాన్ని చూడలేక రాజీనామా చేస్తున్నాను" అని చెప్పాడు. ఈ వీడియోను పరిశీలిస్తున్నామని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News