: తన లోపాలు ఏమిటో తెలిశాయంటున్న లోకేష్!
తన లోపాలేంటో తెలిశాయని టీడీపీ జాతీయ కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ తెలిపారు. తెలుగు దేశం పార్టీ నిన్న వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రతి మనిషిలోనూ లోపాలు ఉంటాయని అన్నారు. అయితే ఆ లోపాలను సవరించుకోగలిగినంత వరకు సవరించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆయన చెప్పారు. ఈ పరీక్షలో పాల్గొని విశ్లేషణ తీసుకున్నానని అన్నారు. ఈ పరీక్ష ద్వారా తనలోని కొన్ని లోపాలు తెలిశాయని ఆయన అన్నారు. వాటిని సవరించుకునేందుకు మనస్తత్వ విశ్లేషకుడి వద్దకు శిక్షణకు వెళ్తున్నానని తెలిపారు. కాగా, ఈ పరీక్ష నిర్వహించిన అనంతరం ఫలితాలు బాగుంటే పార్టీలో కీలంగా వ్యవహరించే గ్రామ స్థాయి నేతలకు కూడా ఈ పరీక్ష నిర్వహించాలని హైకమాండ్ భావిస్తోంది.