: వాహనదారుడిని చితకబాదిన రామ్ చరణ్
మెగా తనయుడు రామ్ చరణ్ తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం తాజ్ డెక్కన్ హోటల్ వద్ద రామ్ చరణ్ కారును మరో వ్యక్తి వాహనం ఢీకొనడంతో ఘర్షణ నెలకొంది. ఖరీదైన ఆస్టన్ మార్టిన్ కారును ఢీకొట్టడంతో తట్టుకోలేని రామ్ చరణ్ ఆ వ్యక్తిని చితకబాదాడు. ఈ ఘటనలో రామ్ చరణ్ అంగరక్షకుడు కూడా చేయిచేసుకోవడంతో సదరు వ్యక్తికి గాయాలయ్యాయి. బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం.