: మైనర్ బాలికల వివాహం కేసు: అది పార్లమెంటు బాగా ఆలోచించి, వివేకంతో తీసుకున్న నిర్ణయం.. సుప్రీంకోర్డుకు చెప్పిన కేంద్రం


భార్యతో భర్త బలవంతపు శృంగారం అత్యాచారం కిందికి రాదని ఈ మధ్యే ఒక కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మైనర్ భార్యతో భర్త శృంగారం కొనసాగించడానికి అనుమతిస్తున్న నిబంధనలను సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్‌ ను సర్వోన్నత న్యాయస్థానం విచారించింది. ఈ సందర్భంగా బాలికలు తమ వివాహాలను రద్దుచేసుకునేందుకు వేర్వేరు చట్టాల కింద వేర్వేరు వయోపరిమితులు విధించడంలో ఉన్న తర్కం ఏంటని జస్టిస్‌ ఎంబీ లోకూర్, జస్టిస్‌ దీపక్‌ గుప్తాల బెంచ్‌ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

బాల్య వివాహాల రద్దుకు ప్రత్యేక చట్టమున్నా అవి కొనసాగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. అవి అసలు పెళ్లిళ్లు కావని, ఎండమావులని ద్విసభ్య బెంచ్ అభిప్రాయపడింది. దీనిపై వివరణ ఇచ్చిన కేంద్రం... బాలికల వయసు 15–18 ఏళ్ల మధ్య ఉంటే వారి వివాహాన్ని రద్దుచేయొచ్చని పార్లమెంట్‌ బాగా ఆలోచించి, వివేకంతో నిర్ణయం తీసుకుందని తెలిపింది. దేశ సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకున్న తరువాతే బాల్య వివాహాలపై పార్లమెంటు చట్టాన్ని రూపొందించిందని స్పష్టం చేసింది. దీనిపై ఇంకా వాదనలు పూర్తికాలేదు. దీనిపై నేడు కూడా విచారణ జరగనుంది. 

  • Loading...

More Telugu News