: తమిళ జాలర్లను వెంటాడి చితకబాదిన శ్రీలంక నేవీ!


తమిళనాడుకు చెందిన జాలర్లపై శ్రీలంక నేవీ సిబ్బంది మరోసారి తమ ప్రతాపం చూపించింది. కచ్చతీవు దీవి సమీపంలో చేపల వేటకు వెళ్లిన తమిళ జాలర్లను శ్రీలంక నేవీ సిబ్బంది గుర్తించారు. తమ సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారని ఆరోపిస్తూ వెంటాడి వారిపై దాడికి దిగారు. వేల మందిని బందీలుగా చేసుకుని వారిపై దాడి చేశారు. ఈ దాడిలో పది మందికి గాయాలయ్యాయి. 20 బోట్లను ధ్వంసం చేశారు. అనంతరం 2,500 మంది మత్స్య కారులను సోమవారం వెనక్కి పంపేశారు. 80 మందిని బందీలుగా ఉంచుకుని, వారిని నిన్న విడుదల చేశారు.  

  • Loading...

More Telugu News