: నున్నలో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం!


 కృష్ణా జిల్లా విజయవాడ శివారు నున్నలో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. టీచర్స్ డే రోజున ఈ ఘటన చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ముగ్గురు విద్యార్థినులు పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో 9వ తరగతి చదువుతున్నారు. రోజూలాగే ఉదయం స్కూల్ కు వెళ్లిన విద్యార్థినులు సాయంత్రం ఇంటికి రాలేదు. దీంతో విద్యార్థినుల స్నేహితురాళ్లు, బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో గాలించిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, వారి కోసం గాలింపు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News