: మీలాంటి ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శం.. మీరు కోరినన్ని తరగతి గదులు కట్టిస్తా: ఉత్తమ ఉపాధ్యాయురాలికి చంద్రబాబు హామీ


ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ క్రమంలో చంద్రబాబు చేతుల మీదుగా సత్కారం అందుకున్న విశాఖపట్టణం జిల్లా చంద్రంపాడు పాఠశాల ఉపాధ్యాయురాలు చంద్రబాబును ఓ కోరిక కోరారు. తాను పనిచేస్తున్న స్కూలుకు భవనం కట్టించి ఇవ్వాలని అభ్యర్థించారు.

వెంటనే స్పందించిన బాబు సత్కారంతో సంతృప్తి చెందని ఆమెను చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. తమ పాఠశాలకు భవనం కట్టించి ఇవ్వాలని కోరిన ఇటువంటి టీచర్లు అందరికీ ఆదర్శప్రాయులన్నారు. ఆమె కోరినన్ని తరగతి గదులు కట్టించి ఇస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. లక్ష్మి  పనిచేస్తున్న పాఠశాలలో 3,300 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు ప్రస్తావిస్తూ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే ప్రభుత్వ స్కూళ్ల ఆదరణకు లోటు ఉండదనేందుకు ఇదే నిదర్శనమని చంద్రబాబు కొనియాడారు.

  • Loading...

More Telugu News