: టీడీపీ వర్క్ షాప్ లో నవ్వులు.. అశోక్ గజపతిరాజుతో యనమల సరదా వ్యాఖ్యలు!
విజయవాడలో జరుగుతున్నటీడీపీ వర్క్ షాప్ లో మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన సరదా వ్యాఖ్యలతో నవ్వులు విరిసాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మీటింగ్ హాల్ లోకి రాగానే..రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వాలని ఆయన్ని యనమల కోరారు. దీంతో, తన వద్ద డబ్బు లేదని, రూ.200 నోటును ఇటీవలే చూశానని అశోక్ గజపతి రాజు సమాధానమిచ్చారు. అయితే, ఇలాంటి నోట్లు ఎన్ని ఉంటే అన్నీ రాష్ట్రానికి ఇచ్చేయాలని యనమల వ్యాఖ్యానించడంతో నవ్వులు విరిశాయి. కాగా, కొత్తగా విడుదలైన రూ.200 నోటును టీడీపీ నేతలందరూ ఆసక్తిగా తిలకించారు. యనమల పక్కనే కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూర్చుని ఉండగా, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తదితర నేతలు ఆ సమయంలో అక్కడ ఉన్నారు.