: బెంగళూరులో దారుణం.. సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య!
బెంగళూరులో దారుణం జరిగింది. సీనియర్ మహిళా జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు గురయ్యారు. స్థానిక రాజరాజేశ్వరి నగర్ లోని తన సొంత ఇంట్లోనే ఆమె హత్యకు గురయ్యారు. ఈ రోజు సాయంత్రం ఆమె నివాసానికి ఓ గుర్తుతెలియని వ్యక్తి వెళ్లి తలుపు తట్టాడు. తలుపు తీయగానే ఆమెపై కాల్పులు జరిపి పారిపోయాడు. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, కర్ణాటకలోని పలు పత్రికలకు ఆమె వ్యాసాలు రాస్తూ ఉంటారు. ధార్వాడ్ బీజేపీ ఎంపీ ప్రహ్లాద్ జోషి, మరో బీజేపీ నేత ఉమేశ్ ధుషితో ఆమెకు వివాదాలు ఉన్నాయి. 2008 జనవరి 23న ఆమె రాసిన కథనాలపై ఈ ఇద్దరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెపై పరువునష్టం కేసులు వేశారు.