: ట్యాంక్‌ బండ్‌పై సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించి నీళ్లలో పడిపోయిన యువకుడు.. గాలింపు చర్యలు ముమ్మరం


వినాయ‌క నిమ‌జ్జ‌నం జ‌రుగుతోన్న నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లోని ట్యాంక్ బండ్ ప‌రిస‌ర ప్రాంతాలు భ‌క్త‌జ‌న సందోహంగా మారిన విష‌యం తెలిసిందే. ఓ వైపు ఆ ప్రాంతంలో నిమజ్జన మహోత్సవం జ‌రుగుతుండ‌గా మ‌రోవైపు ట్యాంక్‌ బండ్‌ వద్దకు వచ్చిన ఓ యువకుడు సెల్ఫీ దిగేందుకు ప్ర‌య‌త్నించాడు. ప్రమాదవశాత్తూ కాలుజారి నీటిలో పడిపోయాడు. ఆ యువ‌కుడి స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్ర‌మ‌త్త‌మైన‌ రెస్క్యూ బృందం నీళ్లలోకి దిగి ఎంత‌గా గాలించినా ఆ యువ‌కుడి జాడ దొర‌క‌లేదు. దీంతో మ‌రింత మంది రెస్క్యూ సిబ్బంది వ‌చ్చి ఆ యువ‌కుడి కోసం గాలిస్తున్నారు.  

  • Loading...

More Telugu News