: చైనా సహా బ్రిక్స్ దేశాల అగ్రనేతలు తీసుకున్న నిర్ణయంపై భగ్గుమన్న పాకిస్థాన్!


చైనా వేదిక‌గా జ‌రిగిన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాల స‌ద‌స్సులో ఆ ఐదు దేశాలు ఉగ్ర‌వాదంపై చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఆసియాలో తీవ్ర స‌మ‌స్య‌గా మారిన తాలిబాన్, ఐసిస్, అల్‌ఖైదా, హక్కానీ నెట్‌వర్క్, లష్కరే తోయిబా, జైషే మహ్మద్ సంస్థలను అణ‌చివేయాల‌ని బ్రిక్స్ సదస్సులో నిన్న‌ మోదీ ఇచ్చిన పిలుపుపై మిగ‌తా నాలుగు దేశాల అగ్ర‌నేత‌లు కూడా సానుకూలంగా స్పందించ‌డం పాకిస్థాన్‌కు మింగుడు ప‌డ‌డం లేదు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ వంటి దేశాల‌పై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్న ఈ ఐదు దేశాల‌పై పాకిస్థాన్ భ‌గ్గుమంది. త‌మ దేశంపై బ్రిక్స్ దేశాల అగ్ర‌నేత‌లు తప్పుడు ఆరోపణలు చేశార‌ని పాకిస్థాన్ పేర్కొంది. పాక్ రక్షణ శాఖ మంత్రి ఖుర్రం దస్తగిర్ ఖాన్ మాట్లాడుతూ.. త‌మదేశం ఉగ్రవాదుల‌ను అణచివేస్తోంద‌ని, ఉగ్ర‌ సంస్థ‌ల‌పై ప్రత్యేక నిఘా ఉందని అన్నారు. త‌మ‌దేశం ఉగ్ర‌వాదుల‌కు స్వర్గధామం కాదని వ్యాఖ్యానించారు.   

  • Loading...

More Telugu News