: దేశ భద్రత, రక్షణ విషయాల్లో భారత్ ఎవరికీ తలవంచదని మోదీ సర్కారు మరోసారి చాటి చెప్పింది: మోహన్ భగవత్
ప్రపంచ దేశాల్లో భారత స్థాయిని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరింత పెంచిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. కర్ణాటకలోని మాందలోని ఓ కాలేజీలో దివంగత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి స్మారక కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ మాట్లాడుతూ... దేశ భద్రత, రక్షణ విషయాల్లో భారత్ ఎవరికీ తలవంచదని, ఈ విషయాన్ని మోదీ సర్కారు మరోసారి ( డోక్లాం విషయంలో) చాటి చెప్పిందని అన్నారు. అలాగే దేశంలో చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం గొప్ప నిర్ణయమని చెప్పారు. మోదీ సర్కారు చేపడుతున్న కార్యక్రమాలు ప్రపంచ దేశాల్లో భారత్ స్థాయిని పెంచాయని అన్నారు. ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని వ్యాఖ్యానించారు.