: ‘మిస్టర్ సి తనకు ఇష్టమైన వాటితో నడచి వెళ్తున్నారంటూ..’ వీడియో పోస్ట్ చేసిన ఉపాసన
‘బద్ధకాన్ని వదలించుకుని.. కదలండి..నడవండి’ అనే విషయాన్ని చెబుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రామ్ చరణ్, తన పెంపుడు కుక్కపిల్లలతో కలసి నడిచి వెళ్తుండటాన్ని గమనించవచ్చు. ఉపాసన తన ఫేస్ బుక్ ఖాతాలో కొన్ని వ్యాఖ్యలు చేస్తూ, ఈ వీడియోను పోస్ట్ చేశారు.
‘మిస్టర్ సి (చరణ్) తనకు ఇష్టమైన వాటితో నడచివెళ్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనానికి కావాల్సిన లక్ష్యాలను మనకు బోధిస్తున్నారు. మన జీవనశైలిలో బద్ధకంగా ఉండటం ఓ వ్యాధి లాంటిదే. కాబట్టి, నడవండి’ అని తన పోస్ట్ లో పేర్కొన్న ఉపాసన, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.