: కర్నూలు జిల్లాలో జలాశయంలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం


ప్ర‌యాణికుల‌తో వెళుతోన్న ఓ ఆర్టీసీ బ‌స్సు అదుపుత‌ప్పి జ‌లాశ‌యంలోకి దూసుకుపోయిన ఘ‌ట‌న కర్నూలు జిల్లా అవుకు మండ‌లంలో చోటు చేసుకుంది. ఆ బ‌స్సుకు చిన్నపాటి బండరాళ్లు అడ్డురావడంతో పాటు ఆ జలాశయంలో నీరు తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ బ‌స్సు జిల్లాలోని కొండమనాయునిపల్లె నుంచి బ‌య‌లుదేరింద‌ని, ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న స‌మ‌యంలో బ‌స్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నార‌ని స్థానికులు తెలిపారు. ప్ర‌యాణికులంతా సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

  • Loading...

More Telugu News