: థ్యాంక్యూ గౌతమ్ గంభీర్ సర్.. నేను డాక్టర్ ని అవుతా: కశ్మీర్ బాలిక జోహ్రా
జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిలో ఏఎస్ఐ అబ్దుల్ రషీద్ ను ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరల్ అయిన ఆయన కూతురు జోహ్రా ఫొటోను చూసిన క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆమె చదువుకు పూర్తి సాయం చేస్తానని ప్రకటించాడు. తనకు సాయం చేస్తానని ప్రకటించిన గంభీర్‌కు జోహ్రా మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. గంభీర్ ట్వీట్‌ను చూసి తనతో పాటు తన కుటుంబం చాలా సంతోషించిందని చెప్పింది. తాను పెద్దయ్యాక డాక్టర్‌నవుతానని తెలిపింది. ఆమెపై గంభీర్ చూపించిన దాతృత్వం పట్ల నెటిజన్లు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.