: మయన్మార్ చేరుకున్న ప్రధాని మోదీ
మయన్మార్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ప్రారంభమైంది. ఆ దేశ రాజధాని నైప్యీడాలోని ఎయిర్‌పోర్టులో ఆయనకి ఘనస్వాగతం లభించింది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఆయన చర్చలు జరపనున్నారు. తాను మయన్మార్‌లో అడుగుపెట్టానని మోదీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. అంతకు ముందు తన చైనా పర్యటన గురించి మోదీ ట్వీట్ చేశారు. బ్రిక్స్ సమావేశం నేపథ్యంలో తనకు చైనా ప్రభుత్వం, ప్రజలు మంచి ఆతిథ్యం ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.