: ఫిఫా అండ‌ర్ 17 వ‌ర‌ల్డ్ క‌ప్ అధికారిక పాట ఇదే!


ఫిఫా అండర్ 17 వ‌రల్డ్ క‌ప్ ఫుట్‌బాల్ అధికారిక పాట‌ను సోనీ పిక్చ‌ర్స్ నెట్‌వ‌ర్క్స్ ఇండియా విడుద‌ల చేసింది. `క‌ర్ కే దిక్లా దే గోల్‌` టైటిల్‌తో ఉన్న ఈ పాట‌ను బాలీవుడ్ గీత‌ర‌చ‌యిత అమితాబ్ భ‌ట్టాచార్య ర‌చించారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్రీత‌మ్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ఈ వీడియోలో గాయ‌నీగాయ‌కులు సునిధి చౌహాన్‌, నీతి మోహ‌న్‌, బాబుల్ సుప్రీయో, షాన్‌, పాపోన్‌, మిఖా సింగ్‌ల‌తో పాటు అభిషేక్ బ‌చ్చ‌న్ కూడా న‌టించాడు. అలాగే ఆట‌గాళ్లు భాయ్‌చుంగ్ భూటియా, మ‌హిళా ఫుట్‌బాల‌ర్ బాలా దేవితో పాటు స‌చిన్ టెండూల్క‌ర్ కూడా ఈ వీడియోలో క‌నిపించాడు. దేశంలోని వివిధ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను ఈ వీడియోలో చూపించారు.

  • Loading...

More Telugu News