sharwanand: 'మహానుభావుడు' నుంచి టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది!

యూవీ క్రియేషన్స్ వారు .. గీతా ఆర్ట్స్ 2 వారు సంయుక్తంగా నిర్మించిన 'మహానుభావుడు' విడుదలకి ముస్తాబవుతోంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాను దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. శర్వానంద్ జోడీగా మెహ్రీన్ నటించిన ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

 ఈ నెల 7వ తేదీ ఉదయం 8 గంటల 45 నిమిషాలకి ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు. కథానాయకుడు అతిశుభ్రతను పాటించే ఓసీడీ అనే మానసిక వ్యాధి కలిగినవాడిగా కనిపిస్తాడట. అందుకు సంబంధించి ఇటీవల వదిలిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో 'భలే భలే మగాడివోయ్' తరహాలో ఈ సినిమా కూడా హిట్ కొడుతుందనే ఆశతో ఈ సినిమా టీమ్ వుంది. గట్టి పోటీ ఉండగా రంగంలోకి దిగుతోన్న ఈ సినిమా, ఎంతవరకూ తట్టుకుని నిలబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.   

More Telugu News