: 'తుమ్హారీ సులు' అంటూ వచ్చేస్తోన్న విద్యాబాలన్!
విలక్షణ నటి విద్యాబాలన్ కొత్త చిత్రం `తుమ్హారీ సులు` ఎప్పుడెప్పుడు వస్తుందా? అని బాలీవుడ్ ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారందరికోసం ఈ సినిమా టీజర్ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ చిత్రంలో రేడియో జాకీగా మారిన గృహిణి పాత్రలో విద్యాబాలన్ నటిస్తోంది. ఈ పోస్టర్‌లో వివిధ కాంటెస్ట్‌లలో గెల్చుకున్న ఐదు బహుమతులను మోస్తూ, మరో చేత్తో ఆకుకూరలతో వున్న హ్యాండ్‌బ్యాగ్ పట్టుకున్న విద్యాబాలన్‌ను చూడొచ్చు.
విశేషం ఏంటంటే.. ఇందులో విద్యాబాలన్ ముఖం మాత్రం కనిపించడం లేదు. ఫస్ట్‌లుక్ సెప్టెంబర్ 14న విడుదల చేయనున్నట్లు సమాచారం. గతంలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ చిత్రంలో రేడియోజాకీగా విద్యాబాలన్ నటించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా సులోచన అలియాస్ సులు పాత్రలో విద్యాబాలన్ అద్భుత ప్రదర్శనను కనబరుస్తుందని సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. సురేశ్ త్రివేణి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదల కానుంది. ఇందులో నేహా దూపియా కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.