: బంగ్లాదేశ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ల బస్సుపై రాళ్లు విసిరిన దుండగుడు!
బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య నిన్న రెండో టెస్టు మ్యాచ్ ప్రారంభమైంది. అయితే, సాయంత్రం ఆట ముగిసిన అనంతరం ఆస్ట్రేలియా క్రికెటర్లు బస్సులో హోటల్కి బయలుదేరగా గుర్తు తెలియని వ్యక్తి ఆ బస్సుపై రాళ్లు విసిరాడు. దీంతో బస్సు కిటికీ అద్దం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటన నేపథ్యంలో ఈ రోజు ఆస్ట్రేలియా క్రికెటర్లు భారీ భద్రత నడుమ రెండో రోజు ఆట కోసం స్టేడియానికి వచ్చారు. భద్రత కారణాలతోనే 10 ఏళ్లుగా బంగ్లాదేశ్లో పర్యటించేందుకు ఆస్ట్రేలియా ఆసక్తి చూపడం లేదు. తాజాగా జరిగిన ఈ ఘటన అలజడి రేపింది.