: డేరా బాబా కాయగూరల మార్కెట్: బొప్పాయి 5,000/-, ఎర్రమిరపకాయ 1,000/-, చిన్న వంకాయ 1,000/-!


సాధ్విల రేప్ కేసులో రోహ్ తక్ జైలులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా గుర్మీత్ రాం రహీం సింగ్ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. భక్తులను ఎంత దారుణంగా దోచుకున్నాడో తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. భక్తి ముసుగులో ఎలా మోసం చేసేవాడంటే... సిర్సాలో సుమారు 700 ఎకరాల్లో డేరా బాబాకు వ్యవసాయ భూములున్నాయి. వీటిలో వివిధ రకాల పంటలు పండిస్తుంటారు. వీటిని బాబా సొంత మార్కెట్‌ లో భక్తులకు విక్రయిస్తాడు. వీటిని మహిమాన్వితమైనవిగా బాబా పేర్కొంటాడు. వాటికి తనకు ఇష్టం వచ్చిన రేటు నిర్ణయిస్తాడు. ఈ ధరలు ప్రపంచంలో ఎక్కడా ఉండవంటే అతిశయోక్తి కాదు. తనకు అత్యంత సన్నిహిత భక్తులకు ఒక్కో బొప్పాయిని 5 వేల రూపాయలకు విక్రయిస్తాడు.

అలాగే అతని చేతుల మీదుగా రెండు టమాటాలు కొనుగోలు చేయాలంటే కనీసం రెండు వేల రూపాయలు చెల్లించాల్సిందే. ఒక్క ఎర్ర మిరపకాయ ధర 1,000 రూపాయలు, చిన్న వంకాయ కావాలన్నా 1,000 రూపాయలు చెల్లించాల్సిందే. వంకాయి సైజు పెరిగితే వెయ్యి పెరిగినట్టే. చిక్కుడు గింజలు (బీన్స్) ని ప్యాక్ చేసి అమ్ముతారు...అరకిలో చిక్కుడు గింజల ప్యాక్ లక్షల రూపాయలు...నాలుగు చిక్కుడు గింజలు 1,000 రూపాయలు. తన తోటలోని కూరగాయలు కొని తింటే ఎలాంటి రోగాలు రావని ప్రచారం చేశాడు. దీంతో భక్తులు వాటికి ఎంత రేటు నిర్ణయించినా కొనుగోలు చేస్తుంటారు. కొందరు భక్తులు బాబా పొలంలో పండిన మహిమాన్విత కూరగాయలు దొరికితే తమ జన్మ ధన్యమైనట్టేనని భావిస్తారని తెలుస్తోంది.  

  • Loading...

More Telugu News