: బై బై గణేశా... గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహాగణపతి
ప్రపంచ ప్రఖ్యాతి చెందిన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ముగిసింది. అశేష భక్తజన సందోహం నడుమ ఆ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. చరిత్రలో రెండోసారి ఖైరతాబాద్ మహాగణనాథుడి నిమజ్జనం మధ్యాహ్నమే ముగిసింది. గతంలో అర్ధరాత్రి సమయంలో ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమయ్యేదన్న విషయం తెలిసిందే. మహాగణపతి నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకున్నారు. ట్యాంక్ బండ్ వద్దకు ఈ రోజు ఉదయం నుంచే భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. మరోవైపు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల నుంచి గణనాథుడి విగ్రహాలు ట్యాంక్‌బండ్ దిశగా తరలివస్తున్నాయి.