: ఇతనితో వేగలేకపోతున్నాను... విడాకులిప్పించండి!: పోలీసులను ఆశ్రయించిన బాలీవుడ్ నటి


హిందీ 'బిగ్ బాస్ సీజన్-1'లో పాల్గొని 'క్యా కూల్ హై హమ్', 'అప్నా సప్నా మనీ', 'శిరీన్ ఫర్హాద్' సినిమాలతో పాటు హిందీ సీరియల్స్ 'క్యూకీ సాస్ బీ కభీ బహూ థీ', 'కౌస్థీ జిందగీ క్యా', 'ససురాల్ సిమర్ కా'లలో నటించిన బాబీ డార్లింగ్ అలియాస్ పాకీ శర్మ తన భర్త నుంచి విడాకులు కోరుతూ పోలీసులను ఆశ్రయించింది.  భోపాల్ కు చెందిన వ్యాపారి రామ్నీక్ శర్మను బాబీ డార్లింగ్ వివాహం చేసుకుంది. అనంతరం తన పేరును పాకీ శర్మగా మార్చుకుంది. తన భర్త గత కొంత కాలంగా హింసిస్తుండడమే కాకుండా అసహజ శృంగారం కోసం వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ముంబైలో తాను కొనుక్కున్న ఇంటిలో వాటాదారుగా తన పేరు రాయించుకున్నాడని, అలాగే భోపాల్ లో పెంట్ హౌస్ కొనుగోలు చేసినప్పుడు అలాగే చేశాడని ఫిర్యాదులో తెలిపింది. వివాహం అయిన వెంటనే తన డబ్బుతో ఎస్యూవీ వాహనం కొనుగోలు చేశాడని తెలిపింది. తరువాత పిల్లలు పుట్టడం లేదని ఆరోపిస్తూ వేధింపులకు పాల్పడ్డాడని పేర్కొంది. తనను కట్నం కోసం వేధిస్తున్నాడని, తన వద్ద ఇప్పుడు డబ్బు ఏమీ లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన ప్రతి కదలికను తెలుసుకునేందుకు సెక్యూరీటీని నియమించాడని, మ్యూచువల్ డైవోర్స్ కి వెళ్దామంటే వేధింపులకు దిగుతున్నాడని, అందుకే పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నానని పాకీ శర్మ తెలిపింది.

  • Loading...

More Telugu News