: గోమాంసం తినకూడదని బీజేపీ ఎన్నడూ చెప్పలేదు: పర్యాటక మంత్రి అల్ఫోన్స్ కన్నన్‌థానమ్
కేంద్ర కేబినెట్‌లోకి పర్యాటక మంత్రిగా కొత్తగా ఎంట్రీ ఇచ్చిన అల్ఫోన్స్ కన్నన్‌థానమ్ తన కార్యాలయంలోకి అడుగిడిన తొలిరోజే సంచలన ప్రకటనలు చేశారు. గోమాంసం తినకూడదని బీజేపీ ఎన్నడూ చెప్పలేదని, కేరళలో కూడా గోమాంసం విక్రయాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. గతంలో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తన రాష్ట్రంలో కూడా గోమాంస వినియోగం కొనసాగుతుందని ప్రకటించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. బీజేపీ పాలిత గోవాలోనే గోమాంసం విక్రయాలు జరుగుతుంటే... కేరళలో ఇక అడ్డు చెప్పేదెవరని ఆయన అన్నారు.