: కంగ‌నాకు పిచ్చి ప‌ట్టింది.. అందుకే పిచ్చిపిచ్చిగా వాగుతోంది: ఆదిత్య పంచోలీ


టీవీ ఇంట‌ర్వ్యూల్లో ఇష్టం వ‌చ్చిన‌ట్లు వ్యాఖ్య‌లు చేస్తున్న కంగనా రనౌత్‌పై ప్రముఖ నటుడు, నిర్మాత ఆదిత్య పంచోలీ మండిపడ్డాడు. కంగనాకు పిచ్చిప‌ట్టింద‌ని, అందుకే అలా పిచ్చిపిచ్చిగా వాగుతోంద‌ని, ఆమె మాట‌ల‌పై త్వ‌ర‌లో చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటానని ఆదిత్య పేర్కొన్నారు. ఇటీవ‌ల ఓ న్యూస్ ఛాన‌ల్‌కు సంబంధించిన `ఆప్ కీ అదాల‌త్‌` కార్య‌క్ర‌మంలో కంగ‌నా ర‌నౌత్ బాలీవుడ్ ప్ర‌ముఖులు హృతిక్ రోష‌న్‌, రాకేశ్ రోషన్‌, క‌ర‌ణ్ జొహార్‌, ఆదిత్య పంచోలీపై కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది.

 హృతిక్ త‌న‌ని ప్రేమించి, త‌ర్వాత మోసం చేశాడ‌ని, ఈ-మెయిళ్లు విడుద‌ల చేసి త‌న‌ను బాగా ఇబ్బంది పెట్టార‌ని, హృతిక్‌, రాకేశ్‌లు త‌న‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కంగ‌నా తెలిపింది. అలాగే త‌న కెరీర్ ప్రారంభంలో ఆదిత్య పంచోలీతో ప్రేమ‌లో ఉన్న‌ట్లు, అప్పుడు త‌న‌ని ఆదిత్య వేధించిన‌ట్లు ఆమె పేర్కొంది. దీనిపైనే ఆదిత్య పంచోలీ ఇప్పుడు స్పందించాడు.

‘ఆమె పిచ్చిది. ఆమె ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు ఓ పిచ్చి పిల్ల మాట్లాడుతున్నట్లు మీకు అనిపించలేదా? మేము చిత్ర పరిశ్రమలో చాలా కాలం నుంచి ఉంటున్నాం. ఇప్పటివరకు ఇంత అసహ్యంగా మాపై వ్యాఖ్యలు చేసినవారు లేరు. బురదలో రాళ్లు వేస్తే అది మనమీదే పడుతుంది. కంగనాపై లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటాను. మిగతా వారి విషయంలో కంగన ఏం మాట్లాడిందో నాకు అనవసరం. నా విషయంలో మాత్రం ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే. ఆమె నాపై వేసిన నిందలు నిరూపించమనండి. నా కుటుంబం ఎంతో అవమానం ఎదుర్కొంది’ అని కంగనపై మండిపడ్డాడు పంచోలీ.

  • Loading...

More Telugu News