: విజయ్ దేవరకొండకు కండలు చూపిస్తున్న ఆర్జీవీ!
వి. హనుమంతరావుతో ముద్దు గొడవలో తనకు మద్దతునిచ్చిన రామ్‌గోపాల్ వర్మను `అర్జున్ రెడ్డి` హీరో విజయ్ దేవరకొండ కలిశారు. ఆ సమయంలో తన కండలు చూపించినందుకు విజయ్ నవ్వాడని ఆర్జీవీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా వారు కలిసిన హోటల్లో దిగిన ఫొటోను కూడా ఆర్జీవీ షేర్ చేశాడు. విజయ్ సెల్ఫీ తీస్తుండగా, ఆర్జీవీ తన కండలు చూపిస్తుండటం, పక్కనే ఒక అమ్మాయి.. ఆ ఫొటోలో కనిపిస్తోంది. `అర్జున్ రెడ్డి` విషయంలో ఆర్జీవీ మద్దతు పలికినందుకు తనను తప్పకుండా కలుస్తానని విజయ్ చెప్పిన సంగతి తెలిసిందే.