: కోచి ఎయిర్ పోర్టులో రన్ వే నుంచి జారి మురికి కాల్వలోకి వెళ్లిపోయిన విమానం


ఎయిరిండియా విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. నేటి వేకువ జామున 2:40 గంటలకు అబుదాబి నుంచి కేరళలోని కోచి ఎయిర్‌ పోర్ట్ కు ఎయిరిండియా విమానం చేరుకుంది. సురక్షితంగా ల్యాండ్ అయింది. అయితే పార్కింగ్ బేకు తీసుకొస్తున్న సమయంలో ఈ విమానం అదుపుతప్పి ట్యాక్సీ వే పక్కనే ఉన్న మురికి కాల్వలోకి జారుకుంది. దీంతో విమాన చక్రం పాక్షికంగా దెబ్బతింది. వేగంగా స్పందించిన విమానాశ్రయ సిబ్బంది విమానంలోని 102 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. 

  • Loading...

More Telugu News