: దిలీప్ కుమార్‌ను పరామర్శించిన ప్రియాంక చోప్రా
ఇటీవల అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరి, డిశ్చార్జి అయిన తర్వాత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న బాలీవుడ్ లెజెండరీ నటుడు దిలీప్ కుమార్‌ను ప్రియాంక చోప్రా పరామర్శించింది. దిలీప్ కుమార్ ఇంట్లో దిగిన ఫొటోలను ఆయన ట్విట్టర్ అకౌంట్లో ఆయన భార్య సైరా భాను పోస్ట్ చేసింది. ప్రస్తుతం దిలీప్ కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె తెలిపారు. ప్రియాంక కూడా దిలీప్ దంపతులను కలవడం ఆనందంగా ఉందని ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ప్రియాంక ఎలాంటి బాలీవుడ్ చిత్రంలోను నటించడం లేదని, అందుకు ఆమె కాల్షీట్లు ఖాళీగా లేవని ప్రియాంక తల్లి మధు చోప్రా తెలిపిన సంగతి తెలిసిందే.