: నాకు హిందీ నేర్పు.. నేను తెలుగు నేర్పిస్తా...ప్రభాస్, శ్రద్ధాకపూర్‌ల ఒప్పందం
హిందీ, తెలుగు భాషల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న చిత్రం `సాహో` షూటింగ్ గురించి ప్రభాస్, శ్రద్ధా కపూర్‌లు ఓ ఒప్పందం చేసుకున్నారు. తనకు హిందీ డైలాగులు పలకడంలో శ్రద్ధా సహాయం కోరాడు ప్రభాస్. అలాగే తెలుగు డైలాగులు పలకడంలో శ్రద్ధాకు సహాయం చేస్తానని ఆమెకు మాట ఇచ్చాడు. ఇలా వీళ్లిద్దరూ చేసుకున్న ఒప్పందం వల్ల షూటింగ్‌లో ప్రత్యేకంగా భాష అనువాదకుడు ఉన్నా అతని అవసరం లేకుండా పోయింది.
ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ చేయనున్నారు. ఇరు భాషల ప్రేక్షకులు నటీనటులు సినిమా డైలాగులను పలికే విషయంలో ప్రత్యేకంగా దృష్టి సారిస్తారనే ఉద్దేశంతో ప్రతి సీన్‌ను రెండు సార్లు షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హిందీ `బాహుబలి`లో ప్రభాస్‌కి శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పారు. `సాహో`లో ప్రభాస్ సొంతంగా హిందీలో డబ్బింగ్ చెప్పుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.