: మిస్ ఇండియా సౌత్ ఆఫ్రికాగా తెలుగు యువతి


ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన అద్దేపల్లి శ్రీశుభ (25) మిస్‌ ఇండియా-దక్షిణాఫ్రికా గాటెంగ్‌ టైటిల్‌ ను గెలుచుకుని సత్తాచాటింది. సౌతాఫ్రికాలోని ఒక ప్రముఖ బ్యాంక్ లో గత ఏడాదిన్నరగా ఐటీ ఎనలిస్ట్ గా పని చేస్తున్న శ్రీశుభ...స్నేహితులు ఛాలెంజ్ చేయడంతో పోటీల్లో పాల్గొన్నానని తెలిపారు. చివరి సెగ్మెంట్ లో 8 మంది అమ్మాయిలతో పోటీ పడిన శ్రీశుభ..డాన్స్ చేసి జ్యూరీ మనసు చూరగొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘‘డ్యాన్స్‌ అంటే నాకెంతో ఇష్టం. గరిష్ఠంగా మూడు నిమిషాలు మాత్రమే ప్రదర్శన ఇవ్వడానికి అనుమతిస్తారు. నా జీవితంలో వివిధ దశలను ప్రతిబింబించడానికి నేను మూడు సెగ్మెంట్లు ఎంపిక చేసుకున్నాను’’ అని అన్నారు. 2009లో దక్షిణాఫ్రికా పీజెంట్ గా నిలిచిన ఆయుషి ఛాబ్రా తరువాత భారత్ లో పుట్టి, ఈ టైటిల్ గెలుచుకున్న రెండో యువతి శ్రీశుభ అని ఈ పోటీలు నిర్వహిస్తున్న ఫరూఖ్ ఖాన్ తెలిపారు. 

  • Loading...

More Telugu News