: వేప చెట్టుకు సీతాఫలం... ఆశ్చర్యంగా చూస్తున్న స్థానికులు!
సృష్టిలో మేధస్సుకు అంతుబట్టని కొన్ని సంఘటనలు అప్పుడప్పుడు చోటుచేసుకుంటుండడం చూస్తుంటాము...అలాంటి ఘటనే మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఫతేపూర్ మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వెనుక వేపచెట్టు ఉంది. ఈ వేప చెట్టుకు అనూహ్యంగా సీతాఫలం కాసింది. దీనిని చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇలాంటి ప్రస్తావన ఏదైనా ఉందా? అని ఆరాతీస్తున్నారు. దీనిని చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.