: బాలాపూర్ గణేషుడి ఊరేగింపు ఆరంభం..లడ్డూ వేలం కోసం చేరుకున్న భక్తులు
హైదరాబాదులో ప్రతిష్ఠాత్మకమైన బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ ఊరేగింపు పూర్తయిన తరువాత లడ్డూ వేలం కొనసాగుతుంది. గత ఏడాది గణేషుడి లడ్డూ వేలంలో 14.5 లక్షల రూపాయలకు అమ్ముడైన సంగతి తెలిసిందే. దీనిని స్కైలాబ్ రెడ్డి సొంతం చేసుకున్నారు. బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకుంటే ఆ ఏడాది సిరిసంపదలు సమకూరుతాయని భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలో బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకునేందుకు బక్తులు పోటీ పడతారు. ఈ సారి జరగనున్న వేలానికి భారీ ఎత్తున భక్తులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భారీ ధర పలుకుతుందని గణేష్ ఉత్సవ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ సారి వేలం బరిలో 15 మంది ఉన్నారని తెలుస్తోంది. ఎవరు లడ్డూను దక్కించుకుంటారా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.