: ఒక్కసారి ఆలోచించండి.. అమెరికాపైకి వందలాది బాంబులు ఎక్కుపెట్టి ఉన్నాయి!: నిక్కీ హేలి


ఉత్తరకొరియా వ్యవహారశైలి, చైనా అనుసరిస్తున్న విధానాలపై ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కిమ్‌ జాంగ్‌ ఉన్‌ యుద్ధాన్ని అడుక్కుంటున్నారని (బెగ్గింగ్‌ ఫర్‌ వార్‌) అన్నారు. ఐక్యరాజ్య సమితి ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన తన వైఖరి వీడడం లేదని ఆమె మండిపడ్డారు. ఇప్పటికి ఆరు అణుపరీక్షలు నిర్వహించారని గుర్తు చేశారు.

ఇప్పటికైనా అతనిని దారికి తేవాలనే ఆలోచనకు స్వస్తి చెప్పాలని ఆమె సూచించారు. తీవ్ర చర్యలు చేపట్టే దిశగా కదలాలని ఆమె అన్నారు. అమెరికాపైకి, అమెరికన్లపైకి కొన్ని వందల బాంబులు గురిపెట్టిన ఉత్తరకొరియా ఎప్పుడు దాడి చెయ్యాలా? అని ఎదురుచూస్తోందని ఆమె అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సహనంతో ఉండలేమని తెలిపింది. యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని, కానీ తమ భద్రత విషయంలో ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News