: అత్యాచార బాధితులను లాయర్లు అడుగుతున్న ప్రశ్నలు.. ఇబ్బందిపడుతున్న బాధితులు!


అత్యాచారం జరుగుతున్నప్పుడు మీరు ఏడ్చారా? అరవడానికి ప్రయత్నించారా? ఆ సందర్భంలో అతడిని గోళ్లతో రక్కారా? ఆ సమయంలో మీకు ఏమనిపించింది?.. సాధారణంగా అత్యాచార బాధితులను ‘సినిమా’ కోర్టుల్లో అడిగే ప్రశ్నలివి. అయితే నిజ జీవితంలోనూ బాధితులను లాయర్లు ఇటువంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతున్నట్టు తేలింది. 2013లో క్రిమినల్ చట్టానికి సవరణలు తీసుకొచ్చిన తర్వాత సంస్కరణలు ఎంతవరకు అమలవుతున్నాయో తెలుసుకునేందుకు ‘పార్ట్‌నర్స్ ఫర్ లా ఇన్ డెవలప్‌మెంట్’ అనే ఎన్‌జీవో చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఢిల్లీలోని నాలుగు ఫాస్ట్ ట్రాక్ కేసుల్లో విచారించిన 16 రేప్ కేసుల్లో అధ్యయనం తర్వాత ఈ విషయాలు బయటపడ్డాయి.

బాధితులను ఇటువంటి ప్రశ్నలు అడగడంపై క్రిమినల్ లాయర్ రెబెక్కా జాన్ మాట్లాడుతూ అందరూ అటువంటి ప్రశ్నలు అడగరని తెలిపారు. గతంతో పోలిస్తే కోర్టులు ఇప్పుడు మరింత సున్నితంగా మారాయని జాన్ అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు అటువంటి ప్రశ్నలు అడుగుతున్న లాయర్లను న్యాయమూర్తులు కూడా అడ్డుకోలేకపోతున్నారని ఆమె తెలిపారు. చాలా ఆసుపత్రుల్లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా అత్యాచార బాధితులకు వైద్య పరీక్షలు జరగడం లేదని అధ్యయనంలో తేలింది. ఆసుపత్రుల్లో ఇప్పటికీ ‘టు-ఫింగర్ టెస్ట్’ చేస్తున్నట్టు బయటపడింది.

  • Loading...

More Telugu News