: తారక్ అన్నను కలిసిన తర్వాత ‘బిగ్ బాస్’ షోను జయించినంత ఆనందం కలిగింది: సంపూ
‘బిగ్ బాస్’ షో లో తాను అడుగుపెట్టిన మొదటి రోజు అనుభవం గురించి ప్రముఖ హాస్యనటుడు సంపూర్ణేష్ బాబు చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ఈ షోలో మొదటి రోజు తారక్ అన్నను కలిసిన తర్వాత ‘బిగ్ బాస్’షోను జయించినంత ఆనందం కలిగింది. ఆ రోజు తారక్ అన్నను కలిసి, ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ కు వెళ్లా. వెళ్లగానే, అక్కడ కళ్లకు గంతలు కట్టేశారు. కళ్లకు గంతలు కట్టగానే నాకు టెన్షన్ మొదలైంది.
అయితే, ఈ లోపు ఓ వెహికల్ వచ్చింది. అక్కడి వాళ్లు చెవిలో చెప్పిన సూచనల ప్రకారం ఆ వాహనం ఎక్కాను. ‘బిగ్ బాస్ ’ హౌస్ డోర్ ముందుకు తీసుకువెళ్లి నా కళ్ల గంతలు విప్పేసి, వెంటనే లోపలికి పంపారు. ఇక, అక్కడ నుంచి ఎక్కడ ఉన్నాం? ఏంటి? అనే విషయమే తెలియదు. ఆ షో లో ఉన్నవాళ్లలో ఎవరితోనూ నాకు పెద్దగా పరిచయం లేదు. కొంచెం ధన్ రాజు, ప్రిన్స్ తప్పా మరెవ్వరితో నాకు బాగా పరిచయం లేదు’ అని చెప్పుకొచ్చారు.