: కొరియా దేశాల మధ్య మధ్యవర్తిత్వానికి స్విస్‌ సంసిద్ధత!


ఉత్తరకొరియా నుంచి ఎదురవుతున్న సమస్యకు తెరదించేందుకు తాము మధ్యవర్తిత్వం చేస్తామని స్విట్జర్లాండ్‌ అధ్యక్షురాలు డోరిస్‌ లూథర్డ్ అన్నారు. ఈ విష‌యంపై అత్యున్నత స్థాయిలో చర్చలను నిర్వహించడానికీ సిద్ధమని పేర్కొన్నారు. దక్షిణ కొరియా, ఉత్తరకొరియాల మధ్య ఉన్న సరిహద్దు వద్ద త‌మ దళాలను మోహరించామ‌ని తెలిపారు. ఈ విష‌యంలో చైనా, అమెరికా కూడా తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె పేర్కొన్నారు. రెండు రోజుల క్రిత‌మే అతి శ‌క్తిమంత‌మైన‌ హైడ్రోజ‌న్ బాంబును ప‌రీక్షించిన‌ ఉత్త‌ర కొరియా.. మ‌రో అణు బాంబును ప‌రీక్షించ‌డానికి సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు మరింత పెరిగాయి. 

  • Loading...

More Telugu News