: కంపెనీ నుంచి వైదొలిగిన టాటా మోటార్స్ అధ్యక్షుడు
తమ సంస్థ అధ్యక్షుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ తిమోతి లేవెర్టన్ రాజీనామా చేశారని టాటా మోటార్స్ సీఈవో, ఎండీ గుంటెర్ బుచ్చక్ తెలిపారు. ఆయనతో తాను కలిసి పనిచేయడం చాలా అద్భుతమని అన్నారు. తమ కంపెనీలో రీసెర్చ్, డెవలప్‌మెంట్ కార్యకలాపాల్లో లేవెర్టన్ ఉత్సాహంగా పాల్గొనే వారని తెలిపారు. ఆయన వ్యక్తిగత కారణాలతో యూకే వెళుతున్నారని చెప్పారు. 2010 నుంచి టాటా మోటార్స్‌తో లేవెర్టన్‌కు అనుబంధం ఉంది. బోల్ట్, జెస్ట్, టియాగో, హెక్సా, ఎస్‌యూవీ నెక్సాన్ వంటి ఎన్నో కొత్త ప్రొడక్ట్‌ల అభివృద్ధికి ఆయన కృషిచేశారు. కాగా, ఆ సంస్థ సీవీ సెగ్మెంట్‌లో తన మార్కెట్ షేరును ఈ ఏడాది 44.4 శాతం కోల్పోయింది.