: మాపై రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు చూడలేదు: వంగవీటి రాధ
విజయవాడలో వంగవీటి రాధ నివాసం వద్ద నిన్న జరిగిన గొడవ విషయమై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యల గురించి కామెంట్ చేయాల్సిందిగా వంగవీటి రాధను మీడియా ప్రశ్నించగా, ‘అసలు, ఆ కామెంట్సే నేను చూడలేదు. ఎలా స్పందిస్తాను? ఏం మాట్లాడతాను?’ అని ప్రశ్నించారు. నిన్న జరిగిన సంఘటనలో సీన్ క్రియేట్ చేసింది తాము కాదని, పోలీసులేనని అన్నారు. తమతో పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారని అన్నారు. పోలీసుల ప్రవర్తన కారణంగా తన తల్లి రత్నకుమారి కాలికి గాయమైందని వాపోయారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి గురించి ప్రస్తావిస్తూ, వైసీపీ నుంచి ఆయన్ని డిస్మిస్ చేయడం ఖాయమని, అతన్ని ఏ పార్టీలోకి కూడా తీసుకోరని రాధ అభిప్రాయపడ్డారు.