: రాజకీయంగా భూస్థాపితం అయిపోదామనే గౌతంరెడ్డి ఆ వ్యాఖ్యలు చేసి ఉంటాడు: వంగవీటి రాధ


వేరే పార్టీలోకి వెళదామనో, రాజకీయంగా భూస్థాపితం అయిపోదామని చెప్పో గౌతంరెడ్డి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటాడంటూ వైసీపీ నేత వంగవీటి రాధ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వంగవీటి రాధ, రంగాలపై గౌతంరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశాడని, అసలు, ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏంటో తనకు అర్థం కావడం లేదని అన్నారు.

గతంలో సీపీఐలో ఉన్న గౌతంరెడ్డి ఆ పార్టీని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడని, ల్యాండ్ మాఫియాతో ఆయనకు సంబంధాలు ఉన్నాయని, రెండు హత్య కేసుల్లో నిందితుడని ఆరోపించారు. గౌతంరెడ్డిపై సుమారు పన్నెండు నుంచి పదమూడేళ్ల పాటు రౌడీ షీట్ ఉందని అన్నారు. గౌతంరెడ్డి తీరుపై పార్టీ అధిష్ఠానానికి  చాలాసార్లు ఫిర్యాదు చేసిన విషయాన్ని రాధ ప్రస్తావించారు. రాధ, రంగాలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని, ఈ వ్యాఖ్యలు గౌతంరెడ్డి కావాలనే చేశారా? లేక ఎవరైనా ఈ విధంగా మాట్లాడించారా? అనే విషయం తెలియాల్సి ఉందని అన్నారు.  

  • Loading...

More Telugu News