: ‘బ్లూ వేల్’ గేమ్ ఆడి ఆత్మహత్య చేసుకున్న మరో విద్యార్థి
భారత్‌లో బ్లూ వేల్ ఆన్‌లైన్ గేమ్ యువతను ఓ వ్యాధి పట్టినట్లు పట్టి పీడిస్తోంది. ఈ గేమ్ బారిన పడి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటీవలే మధ్యప్రదేశ్‌లోని దామో జిల్లాకు చెందిన సాత్విక్ పాండే (17) అనే విద్యార్థి తాను చదువుకుంటోన్న ఇంటర్ కాలేజీ పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోగా అతడిని ఉపాధ్యాయులు రక్షించారు. అయితే, బ్లూ వేల్ గేమ్‌కు బానిసైన ఆ విద్యార్థి చివరకు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మొన్న సాయంత్రం ఇంటినుంచి వెళ్లిన తమ కుమారుడు సాత్విక్ మళ్లీ తిరిగి రాకపోవడంతో అతడి తల్లిదండ్రులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పట్టణ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై పోలీసులు అతడి మృతదేహాన్ని గుర్తించారు.