: యూపీ అసెంబ్లీలో ఆ రోజు ఎమ్మెల్యే సీటు కింద దొరికింది సాధారణ పౌడరే.. తేల్చి చెప్పిన అధికారులు!
కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఓ ఎమ్మెల్యే సీటు కింద అనుమానాస్పద ప్యాకెట్ లభించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అప్పుడు పెద్ద దుమారమే చెలరేగింది. ఆ ప్యాకెట్‌లో శక్తిమంతమైన పెంటాఎరిత్రిటాల్ టెట్రానైట్రేట్ (పీఈటీఎన్) ఉందని అప్పట్లో ఫోరెన్సిక్ అధికారి ఒకరు చెప్పారు. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి విచారణకు ఆదేశించారు. 50 రోజులపాటు పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు చివరికి ఆ ప్యాకెట్‌లో ఉన్నది కేవలం పౌడర్ మాత్రమేనని తేల్చి చెప్పారు. దీనిపై తప్పుడు ధ్రువీకరణ ఇచ్చిన ఫోరెన్సిక్ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఆ ఎమ్మెల్యే సీటు కింద ఈ పౌడర్‌ను ఎవరు పెట్టారనే విషయం తేలాల్సి ఉంది.