: మలాలా జీవిత చరిత్ర `గుల్ మకాయ్` ఫస్ట్‌లుక్ ఇదే!
పాకిస్థానీ క్రియాశీలకవాది, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న `గుల్ మకాయ్` చిత్రం ఫస్ట్‌లుక్ విడుదలైంది. ఈ సినిమాలో మలాలా పాత్రలో బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమున్న రీమ్ సమీర్ షేక్ నటిస్తోంది. `యే రిష్తా క్యా కహ్లాతా హై`, `న బోలే తుమ్ న మైనే కుచ్ కహా` సీరియళ్ల ద్వారా రీమ్ సుపరిచితమే. ఈ పాత్ర కోసం రీమ్ ప్రత్యేకంగా కొన్ని వారాల పాటు శిక్షణ తీసుకుంది. ఈ సినిమాలో మలాలా తల్లి పాత్రను దివ్య దత్తా పోషిస్తోంది. అలాగే ఇందులో ఓం పురి, రాగిణి ఖన్నాలు కీలక పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది.