: మరోసారి వార్తల్లో నిలిచిన ఆమ్రపాలి.. పాండవుల గుట్టను అధిరోహించిన కలెక్టర్!
రాక్ క్లైంబింగ్ వేడుకల్లో భాగంగా వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి పాండవుల గుట్టను అధిరోహించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. ఈ వేడుకలను నిన్న జయశంకర్ జిల్లా రేగొండ మండలంలోని పాండవులగుట్టల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆమ్రపాలితో పాటు అటవీశాఖ అధికారి అర్పన కూడా ఆ గుట్టపైకి ఎక్కారు. ఈ వేడుకల్లో భాగంగా మొత్తం 150 మంది విద్యార్థులు రాక్ క్లైంబింగ్ విన్యాసాలను ప్రదర్శించారు. దీంతో పెద్ద ఎత్తున యువత పాండవుల గుట్టలకు చేరుకుంది. ఒక వైపు కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న ఆమ్రపాలి అప్పుడప్పుడు ఇలా సాహసాలు చేస్తూ యువతకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు.