: ఆ పాత్రను ట్రంప్ డిమాండ్ చేశాడు... `హోం ఎలోన్2` సినిమాలో ట్రంప్ సీన్ గురించి మ్యాట్ డామన్ వ్యాఖ్య
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికవడానికి ముందు డొనాల్డ్ ట్రంప్ `హోం ఎలోన్ 2: లాస్ట్ ఇన్ న్యూయార్క్` చిత్రంలో కనిపించిన సంగతి తెలిసిందే. 1992లో ట్రంప్‌కి పెద్దగా క్రేజ్‌లేని సమయంలో ప్రత్యేకంగా సినిమాలో ఎలాంటి ప్రాముఖ్యం లేని 6 సెకన్ల సీన్‌లో ట్రంప్ చేత ఎందుకు నటింపజేశారన్న విషయాన్ని హాలీవుడ్ హీరో మ్యాట్ డామన్ బయటపెట్టాడు.
ఆ ఆరు సెకన్ల పాత్రను ట్రంప్ బలవంతంగా డిమాండ్ చేసి, రాయించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆ సినిమాలో ఓ సన్నివేశం కోసం ట్రంప్ యాజమానిగా ఉన్న హోటల్ కావాల్సివచ్చింది. అయితే ఆ హోటల్‌లో షూటింగ్ చేయాలంటే చిత్రంలో తనను నటింపజేయాలని ట్రంప్ షరతు విధించాడట. దీంతో ప్రత్యేకంగా ట్రంప్ కోసం ఆ సన్నివేశాన్ని సృష్టించి తెరకెక్కించినట్లు మ్యాట్ డామన్ చెప్పాడు.