: 7 వేల మంది భారతీయ అమెరికన్లపై ప్రభావం చూపనున్న ట్రంప్ నిర్ణయం!


చిన్నారులుగా అమెరికాలో అడుగుపెట్టి, అక్కడే ఉంటూ పనిచేసుకుంటున్న లక్షలాది విదేశీయులపై అధ్యక్షుడు ట్రంప్ తీసుకోబోయే నిర్ణయం పెను ప్రభావాన్ని చూపనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ఈ ప్రోగ్రాంపై ట్రంప్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. తమ తల్లిదండ్రులతో కలసి వచ్చి, పెద్దయ్యాక ఇప్పుడు అక్కడే సెటిలై పోయినవారిని అక్రమ వలసదారులుగా గుర్తించనున్నారు. వారిని తిరిగి స్వదేశాలకు పంపబోతున్నారు.

 అమెరికాలో ఉన్న ఇలాంటి వారిపై చర్యలు తీసుకోకుండా అప్పటి ఒబామా ప్రభుత్వం 'బాల్యంలో వచ్చిన వారిపై చర్యలు వాయిదా (డీఏసీఏ)' పేరుతో ఓ కార్యక్రమం చేపట్టింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ట్రంప్ రద్దుచేయబోతున్నారు. ఒబామా ఇచ్చిన ఉత్తర్వులను ఈ నెల ఐదో తేదీలోగా రద్దు చేయాలని, లేకపోతే న్యాయస్థానాలకు వెళతామంటూ ట్రంప్ కు అనుకూలంగా ఓటేసిన రాష్ట్రాలు డెడ్ లైన్ విధించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కూడా నిషేధాన్ని ఎత్తివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. ఒక వేళ డీఏసీఏని ట్రంప్ రద్దు చేస్తే దాని ప్రభావం 7.5 లక్షల మందిపై పడనుంది. 7 వేల మందికి పైగా భారతీయులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది.  





  • Loading...

More Telugu News