: మనల్ని ఎవడన్నా తిడుతోంటే భరించడం త‌ప్పే!: నాగబాబు


మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ప్ర‌శంస‌లు కురిపించారు. త‌న అన్నయ్య చిరంజీవికి నటుడిగా ఫాలోయింగ్ ఉంద‌ని, అయితే, కల్యాణ్ బాబుకు నటుడిగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఉందని అన్నారు. ప‌వ‌న్ ప్ర‌జ‌ల్లో తిరిగిన విధానం, చేసిన పనులే అతడికి ఈ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టాయని చెప్పారు. త‌న‌కు తెలిసినంత‌వ‌ర‌కు టాలీవుడ్‌లో ఆ ఫాలోయింగ్ ఇత‌రులెవరికీ లేద‌ని వ్యాఖ్యానించారు.

కాగా, మెగా ఫ్యాన్స్ లో పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఉంటారని,  పవర్ స్టార్ ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్సేనని నాగ‌బాబు అన్నారు. ఇక, విమర్శకులని మనం అలాగే వదిలేస్తే, తప్పు మనదే అవుతుందని నాగ‌బాబు అన్నారు. మనల్ని ఎవడన్నా తిడుతోంటే భరించడం త‌ప్పేన‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News