: నష్టపరిహారం చెక్కును తిరస్కరించిన 'నీట్'కు బలైన అనిత కుటుంబం!


నీట్ (నేషనల్ ఎలిజిబులిటీ ఎంట్రన్స్ టెస్ట్) నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన తమిళ విద్యార్థి అనిత గుర్తుండే ఉంటుంది. ఈ సంఘటన నేపథ్యంలో నష్టపరిహారం కింద రూ.7 లక్షల చెక్కును ఆ విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ చెక్కును తీసుకునేందుకు అనిత కుటుంబసభ్యులు నిరాకరించారు.

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి గతంలో చేసిన ప్రకటన మేరకు ఆ చెక్కును అందజేసే నిమిత్తం అరియలూరు కలెక్టర్ జి.లక్ష్మిప్రియ స్వయంగా అనిత ఇంటికి వెళ్లారు. ఆ చెక్కును ఆమె కుటుంబసభ్యులకు ఇచ్చేందుకు ప్రయత్నించగా వారు ఒప్పుకోలేదు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు కల్పించాలని అనిత ఆత్మహత్యకు పాల్పడిందే తప్పా, ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం కాదని ఆమె సోదరుడు మణిరత్నం అన్నారు.

  • Loading...

More Telugu News